- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్ఫస్ ఫండ్ ఇవ్వండి.. సీఎస్ను కోరిన గోట్ అండ్ షిఫ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఏటా వివిధ కారణాలతో 6వేల గొర్రెలు మృతి చెందుతుండటంతో గొర్రెల కాపరులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వారికి చేయూతనిచ్చేందుకు కార్ఫస్ ఫండ్ కేటాయించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కోరారు. సీఎస్ శాంతికుమారితో బుధవారం బీఆర్కేఆర్ భవన్ లో భేటీ అయ్యారు. రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం విధివిధానాలు, మృతి చెందుతున్న గొర్రెలు, కాపరులు పడుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బాలరాజుయాదవ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో గొర్రెల పెంపకం దారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసు కొనేందుకు ‘గొర్రెలమంద వద్ద పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, వాక్సినేషన్, నట్టల నివారణ పై కాపరులకు వివరిస్తున్నామన్నారు.
గొర్రెల పంపిణీతో గొల్ల కాపరుల జీవితాల్లో వచ్చిన ఆర్థిక, సామాజిక మార్పులను తెలుసుకునుటకు పథక సమగ్ర అద్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రమాదంలో గొర్రెలను నష్టపోయిన పెంపకం దారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేసీఆర్ జీవబంధు అను కొత్త పథకం అమలు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని వెల్లడించారు. జంట నగరాల్లోని మాంస ప్రియులకు నాణ్యమైన మాంసాన్ని అందించాలనే సత్సంకల్పంతో ఫెడరేషన్ కార్యాలయ ఆవరణలో త్వరలో కేసీఆర్ మటన్ క్యాంటీన్ ను ప్రారంభించి నాణ్యమైన మటన్ బిర్యానీ, బోటి, మటన్ కూరలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి రూ.6125 కోట్లతో 3లక్షల 50 వేల గొర్రెల యూనిట్ల ద్వారా సుమారు 80 లక్షల గొర్రెలను లబ్ధిదారులందరికి అందజేస్తామన్నారు.