బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. ఆరిజన్ డెయిరీ సీఈఓ సెజల్

by Javid Pasha |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. ఆరిజన్ డెయిరీ సీఈఓ సెజల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యే తన అధికారం అడ్డం పెట్టుకుని తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, ఆయన నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆరిజన్ డెయిరీ సంస్థ సీఈఓ సెజల్ తాజాగా జాతీయ మహిళ కమిషన్ ను ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం ఎన్ సీడబ్ల్యూ కు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా తన అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని కంప్లైంట్ రిజిస్టర్ కానివ్వకుండా అడ్డుపడుతున్నాడని అందువల్ల జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు సెజల్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

ఇకనైనా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమను బ్లాక్ మెయిల్ చేయడం, మమ్మల్ని బెదిరించడం ఆపితే మీకే మంచిది అంటూ వీడియోలో హెచ్చరించింది. తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా ఎవరైనా వదిలిపెట్టేది లేదని వెల్లడించింది. తన ఫిర్యాదుపై స్పందించిన ఎన్ సీడబ్ల్యూ తనకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇచ్చినట్లు సెజల్ తెలిపింది. కాగా ఓ భూసెటిల్ మెంట్ వివాదంలో ఆరిజన్ డెయిరీకి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారం ఢిల్లీకి చేరడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed