గుడ్ న్యూస్.. రేషన్ కార్డ్, ఆధార్ లింక్‌ గడువు మరోసారి పెంచిన కేంద్రం

by Anjali |   ( Updated:2023-03-26 09:26:53.0  )
గుడ్ న్యూస్.. రేషన్ కార్డ్, ఆధార్ లింక్‌ గడువు మరోసారి పెంచిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డ్, ఆధార్ లింక్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు, ఆధార్ లింక్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చి 31తో రేషన్ కార్డ్, ఆధార్ లింక్‌ గడవు ముగియనుండగా.. దానిని జూన్ 30 వరకు పొడిగించింది. ఇప్పటివరకు రేషన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోనివారు వెంటనే లింక్ చేసుకోవాలని కేంద్రం ఈ సందర్భంగా సూచించింది. ఈ లింక్ ప్రక్రియ కోసం పబ్లిక్ డిస్ర్టిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్‌ను సందర్శించాలని పేర్కొంది. నకిలీ రేషన్ కార్డులతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని గుర్తించడానికి కేంద్రం ఈ లింక్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story