సెల్‌ ఫోనే లోకం కాదు!.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్

by sudharani |   ( Updated:2023-11-07 13:32:49.0  )
సెల్‌ ఫోనే లోకం కాదు!.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా మంది ఫోన్ మైకంలో పడి చుట్టూ ఏం జరుగుతుందో కనీసం పట్టించుకోవడం లేదు. రోడ్డుపైనే ఫోన్లు మాట్లాడటం, వీడియోస్ చూడటం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్నికొన్ని సార్లు దొంగతనాలు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ రోడ్డుపై సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతుంది. ఆమె వెనుకే వచ్చిన వ్యక్తి ఆ ఫోన్ లాక్కుని పారిపోయాడు. సీసీ టీవి ఫుటేజ్‌లో రికార్డ్ అయిన ఈ వీడియోపై టీఎస్ఆర్టీసీ సజ్జనార్ స్పందింస్తూ ‘సెల్‌ ఫోనే లోకం కాదు! రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్‌ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయి’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story