- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోస్టులు పెంచమంటే లాఠీఛార్జి చేస్తరా.. ప్రొఫెసర్ కోదండరామ్ సీరియస్
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో ప్రకటించినట్లుగా 13,086 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించకుండా కేవలం 5,089 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు శాంతియుతంగా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతుంటే వారిపై లాఠీఛార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ ఆందోళనకు దిగిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియంలో నిర్భందించారు.
వారిని పరామర్శించేందుకు వెళ్లిన కోదండరామ్ అక్కడి నుండి ఓ వీడియోను విడుదల చేశారు. మీ వెంట ఎవరున్నారో చెప్పాలని అభ్యర్థులను పోలీసులు వారిని కొడుతున్నారని నిజానికి వారి వెంట ఎవరూ లేరన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఆవేదనతోనే వారంతా ఆందోళనకు దిగారే తప్ప వారి వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు లేవన్నారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. తమ గోడును వినేవారు లేకనే నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారని దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు లాఠీచార్జి ఘటనపై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.