బ్రేకింగ్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. TSPSC కీలక నిర్ణయం..!

by Satheesh |   ( Updated:2023-09-23 07:33:13.0  )
బ్రేకింగ్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. TSPSC కీలక నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, హైకోర్ట్ తీర్పుపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అప్పీల్‌కు వెళ్లనుంది. హైకోర్టు సింగల్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని వెంటనే ఇవ్వాలని టీఎస్పీఎస్సీ లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. సోమవారం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఏడాది జూన్ జూన్ 11వ తేదీన టీఎస్పీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్- 1 పరీక్షను నిర్వహించింది. అయితే, పరీక్ష సమయంలో బయో మెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం, హాల్టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎమ్మార్ షీట్ ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది.

పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి ఈ పరీక్షను ఈ ఏడాది జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు మరోసారి గ్రూప్-1 పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా.. 2.32 లక్షలమందికి పైగా అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు.

Advertisement

Next Story