ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

by Y. Venkata Narasimha Reddy |
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీమ్ కోర్టు తీర్పు అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లు రవిలు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఎస్సీలలో ఉన్న జనాభా, కులాలు పూర్వాపరాలపైన, పంజాబ్, హర్యానా, తమిళనాడులలో ఎస్సీ రిజర్వేషన్ అమలు అవుతున్న తీరు పైన సమావేశంలో చర్చించారు. త్వరలో వర్గీకరణపై నిపుణులతో ఆయా రాష్ట్రాల్లో పర్యటన ఏర్పాటు చేయాలని, వర్గీకరణ అందరి అభిప్రాయాలు కమిటీ స్వీకరించాలని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా సమగ్ర అధ్యయనంతో అందరికీ న్యాయం జరిగే విధంగా కమిటీ విధివిధానాలను రూపొందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సమావేశం వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Advertisement

Next Story