Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై హైకమాండ్ గప్‌చుప్.. ఆసెంబ్లీ లాబీల్లో ఆశావహుల చిట్‌చాట్

by Shiva |
Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై హైకమాండ్ గప్‌చుప్.. ఆసెంబ్లీ లాబీల్లో ఆశావహుల చిట్‌చాట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేబినెట్ విస్తరణ కోసం ఆశావాహలు కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. సీనియర్ మంత్రులను కలిసినప్పుడు తమ అసెంబ్లీ సెగ్మెంట్ విషయాలు మాట్లాడిన తర్వాత చివరగా ‘అన్న కేబినెట్ విస్తరణ ఎప్పుడు?’ అని ఆరా తీస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు విస్తరణకు ముహుర్తం ఉంటుందా..? మాకు మంత్రి పదవులు వస్తాయా? అని అడుగుతున్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షణ తెలంగాణ‌కు చెందిన ఓ ఎమ్మెల్యే విస్తరణ ఆలస్యం అవుతోందని ఆసహనం వ్యక్తం చేశారు.

‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. ఇంకా ఎప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తారు? ఇప్పటికే చాలా లేట్ అయింది. సీఎం మనస్సులో ఏముందో తెలియదు. అలాగే హైకమాండ్ ఏం అనుకుంటుందో తెలియట్లేదు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు కేడర్ కూడా మంత్రి పదవి ఎప్పుడిస్తారు? అని అడుగుతున్నారు. వాళ్లకు ఏం ఆన్సర్ ఇవ్వలేక చస్తున్నాను.’ అని వివరించారు. అలాగే మరో సీనియర్ ఎమ్మెల్యే మంత్రివర్గం విస్తరణపై మాట్లాడారు. ‘ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా ఏం ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే 14 నెలల టైమ్ గడిచి పోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అంటే, మరో నాలుగైదు నెలలు పడుతుంది. అప్పుడు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే..’ అని కామెంట్ చేశారు.



Next Story

Most Viewed