‘మునుగోడు’లో రోడ్డు నెట్వర్క్‌ను రూపొందించండి : కోమటిరెడ్డి

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-16 15:00:46.0  )
‘మునుగోడు’లో రోడ్డు నెట్వర్క్‌ను రూపొందించండి : కోమటిరెడ్డి
X

దిశ, చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రోడ్డు నెట్వర్క్ రూపొందించాలని ఆ శాఖ అధికారులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకు మునుగోడులో ఉన్న రోడ్లు ఎన్ని? ఇప్పటివరకు ఎన్ని రోడ్లకు ప్రపోజల్స్ పంపించారు...? కొత్తగా ఇంకా ఎన్ని కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలి..? పంచాయతీ రాజ్ నుంచి రోడ్లు మరియు భవనాల రోడ్లుగా మార్చే రోడ్లు ఎన్ని ఉన్నాయి...? అనే అంశాలపై క్షుణ్ణంగా పంచాయతీరాజ్ అధికారులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం సమీక్షించారు. కొత్తగా నిర్మాణం చేపట్టబోయే రోడ్డు మార్గాలతో పాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రోడ్డు మార్గాలలో బ్లైండ్ టర్నింగ్స్, ప్రమాదపు మూలమలుపులు, బ్లాక్ స్పాట్స్‌లను గుర్తించి ప్రమాదాల నిర్మూలనకు వెంటనే చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన నిధుల ఎస్టిమేషన్స్‌ను వెంటనే రూపొందించాలని ఆదేశించారు.

ఈ ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి సమగ్రమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్లాలని అధికారులను కోరారు. రోడ్లతోపాటు పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న కొత్తగా నిర్మించబోయే గ్రామపంచాయతీ భవనాలు, సబ్ సెంటర్స్, అంగన్ వాడీ కేంద్రాల భవనాలు, డోర్లు, దోమలు రాకుండా మెష్‌తో కూడిన కిటికీలు, బాత్రూంలను నాణ్యతతో నిర్మించాలని ఆదేశించారు. అన్ని భవనాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఇప్పటికే మునుగోడులో ఉన్న గ్రామపంచాయతీ భవనాల మరమ్మతులకు ఎస్టిమేషన్స్ రెడీ చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed