- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కబ్జాలు, కమీషన్లు బీఆర్ఎస్ పేటెంట్ అయిపోయాయి.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కబ్జాలు, కమీషన్లు, సెటిల్మెంట్లు, దందాలు బీఆర్ఎస్ పేటెంట్ అయిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ లోని నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఆ పార్టీలోని ఓ మోస్తరు నాయకురాలే రూ.30 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారంటే ఇక అసలు దొరలు ఎన్ని వేల కోట్ల భూములు కబ్జా చేశారో ఊహించుకోవచ్చని పరోక్షంగా సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ ను గద్దె దించితే తప్ప ఈ అవినీతికి అంతం ఉండదని అన్నారు. బహుజన రాజ్యంలో బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా సాధించుకున్న భూములను స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచిపెడుతామని అన్నారు.
Next Story