BRS MLC Kaushik Reddyపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలి.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

by Javid Pasha |   ( Updated:2023-07-21 10:07:13.0  )
BRS MLC Kaushik Reddyపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలి.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధికారం అడ్డంపెట్టుకొని కుల దూరహంకారంతో కళ్ళు నెత్తి కెక్కి దళితుడైన ప్రోటోకాల్ డ్రైవర్ పై చేయి చేసుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ముదిరాజ్ బిడ్డ అజయ్ అనే జర్నలిస్టును కులం పేరుతో దూషించి, చంపేస్తానని కౌషిక్ రెడ్డి బెదిరించాడని అన్నారు.

ఇవన్నీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. దళితులు,ముదిరాజ్ ల మనోభావాలను కించపరిచిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని, ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేసి ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డిని జైలుకు పంపాలని అన్నారు. తక్షణమే పాడి కౌషిక్ రెడ్డి బాధితుడికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more : disha newspaper


Advertisement

Next Story