- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వెయ్యి పొర్లు దండాలు పెట్టిన గెలవలేరు'.. రాజాసింగ్ ఛాలెంజ్‌కు బీఆర్‌ఎస్ కౌంటర్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీఆర్ఎస్‌కు మధ్య ఫైట్ ముదురుతోంది. రాజాసింగ్ చేసిన రూ.100 కోట్ల ఛాలెంజ్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. 'రాజాసింగ్ రూ.1000 కోట్లు పంచి, 1000 పొర్లు దండాలు పెట్టిన గోషామహల్ ప్రజలు ఆయన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు' అంటూ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలో ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.
కాగా మూడు రోజుల క్రితం రాజాసింగ్ మాట్లాడుతూ గోషామహల్‌లో మళ్లీ తానే గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ ప్రజలకు ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవరని అన్నారు. బీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఇక్కడ విజయం తనదే అని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తాను గెలిచి వస్తానన్నారు. రాజాసింగ్ చేసిన సవాల్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ నేతలు తాజాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజాసింగ్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం మరోసారి హీటెక్కింది.
గోశామహల్లో రాజా సింగ్ 1000 కోట్ల సవాల్‌కు ప్రతి సవాల్ విసిరిన బీఅర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్.
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2023
రాజా సింగ్ 1000 పొర్లు దండాలు పెట్టి 1000 కోట్లు పంచినా ఓట్లు వేయరు అంటూ కోఠి, అబిడ్స్, MJ మార్కెట్, జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీఅర్ఎస్ నాయకుడు https://t.co/puMXI0qVvb pic.twitter.com/mdijY7uirZ