- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పగటి కలలు.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని పగటి కలలు కంటున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అన్ని చోట్ల బీజేపీ ఖాతాలు క్లోజ్ అవుతాయని, తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక లో ఘోర పరాజయం తో బీజేపీ ముక్త్ సౌతిండియా మారిందన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని పేర్కొన్నారు.
ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తున్న కమలనాథుల విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి పేదల బతుకులను బలి చేస్తున్న మోడీ డ్రామాలకు తెర వేయడానికి కర్ణాటక ప్రజలు దేశానికి దిశా నిర్దేశం చేశారన్నారు.బీజేపీ పాలన నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చిందన్నారు. తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.హ్యాట్రిక్ కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారన్నారు. కర్ణాటక ఫలితాలపై రేవంత్, బండి సంజయ్ లది వింత ధోరణి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు.
Read More: తెలంగాణలో ఆ ఫార్ములా.. రాష్ట్రంపై ప్రియాంక స్పెషల్ ఫోకస్!