- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవితకు భారీ షాకిచ్చిన సొంత పార్టీ.. నిజామాబాద్ ఎంపీ బరిలో కొత్త ముఖం!
దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కవితకు అవకాశాలు అంతంతమాత్రమే. ఆమెకు టికెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా లేదు. దాదాపుగా ఆమెకు పోటీచేసేందుకు అవకాశం ఇవ్వొద్దనే అభిప్రాయంతోనే పార్టీ నాయకత్వం ఉన్నది. పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇటీవల జరిగిన నిజామాబాద్ సెగ్మెంట్ మీటింగ్‌లో ఆమె లేవనెత్తిన అంశాలు, ఆమెకు మద్దతుగా మాత్రమే కాక పార్టీ లీడర్‌షిప్ వైఫల్యాలను పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించడంతో అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనులను పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది. బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలా?.. లేక ఎన్ఆర్ఐ వ్యక్తికి ఇవ్వాలా అనే చర్చలు మొదలయ్యాయి.
తొలిసారి పోటీచేసినప్పుడు 2014లో ఎంపీగా గెలిచిన ఆమె 2019లో ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి, వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోడానికి ఆమె తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ పరిధిలోని కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. సొంత పార్టీ నాయకులే సరిగా సహకరించలేదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదలు పలువురు లోకల్ కేడర్‌కు అందుబాటులో లేకపోవడం కారణమంటూ కవిత సహా ఆ ఎంపీ సెగ్మెంట్‌కు చెందిన లోకల్ బాడీల లీడర్లు సన్నాహక సమావేశంలో ఓపెన్‌గానే కామెంట్లు చేశారు. కేటీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని లోక్‌సభ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోడానికి మొదలుపెట్టిన కసరత్తులో భాగంగా నిజామాబాద్‌కు సెగ్మెంట్‌లో కవితకు బదులుకా మరో అభ్యర్థి బరిలో నిల్చునే అవకాశమున్నది. ఆమెకు టికెట్ నిరాకరిస్తే పార్టీ కేడర్‌కు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది?.. అది రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపి మరింత చేటు తెస్తుందా?.. పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం చేసుకుంటారా?.. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.