- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నడా’
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఒక సర్కస్ కంపెనీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందా ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నడా అని ప్రశ్నించారు. బీజేపీ ఏజెంట్‌లా రేవంత్ పనిచేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌కు జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీఅధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
సంచలనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి సంబంధించి కేటీఆర్ అన్ని విషయాలు సమగ్రంగా చెప్పేసరికి రేవంత్ రెడ్డి అధికారులపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఎంతమంది గ్రూప్-1 ఎగ్జామ్ రాశారో తెలియడానికి అధికారుల సాయం కావాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీకి ఏజెంట్‌లా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిట్ అధికారిని ఆంధ్రా అధికారి అని అనడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి రేవంత్.. ఆయన ఇప్పుడు నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేసిన బీజేపీతో రాహుల్ కలిసిపోయాడని విమర్శించారు. మోడీ కంటే కేసీఆర్ కే రాజకీయ అనుభవం ఎక్కువ అన్నారు. కేటీఆర్‌కు నీతులు బోధించే స్థాయి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు లేదు అని స్పష్టం చేశారు. సంస్కారం నేర్పితే ముందుగా బండి సంజయ్‌కు రఘునందన్ నేర్పాలని, రఘునందన్ ఓ కాగితపు పులి అని విమర్శించారు. ఎక్కడ ఏ పని చేయాలో రఘునందన్‌కు తెలియదని పేర్కొన్నారు.