మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన BRS MLA రాజయ్య (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-06-24 14:48:21.0  )
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన BRS MLA రాజయ్య (వీడియో)
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత ప్రజాబ‌లం ఉన్న త‌నను రాజ‌కీయంగా దెబ్బకొట్టేందుకు లేని పోని ఆరోప‌ణ‌ల‌ను కొంత‌మంది చేయిస్తున్నార‌ని ఎమ్మెల్యే రాజ‌య్య భావోద్వేగంతో అన్నారు. ‘ఆడోళ్లను అడ్డుపెట్టుకుని రండ రాజ‌కీయాలు చేస్తున్నారు’ అని ఇటీవ‌ల జ‌రిగిన న‌వ్య ఆరోప‌ణ‌లను ఉద్దేశించి ఆయ‌న ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు యువ‌త‌, మ‌హిళ‌ల బ‌లం ఉంద‌ని, ఆ బ‌లాన్ని త‌గ్గించేందుకు కుట్రలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. తాను మ‌హిళ‌ల హ‌క్కుల కోసం, వారి సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చిన‌వాడిన‌ని అన్నారు. తనకు 63 సంవ‌త్సరాలు, న‌లుగురు చెల్లెళ్లు, కొడుకులు, కొడ‌ళ్లు, మ‌న‌వ‌లు, మ‌న‌వ‌రాండ్లు వ‌చ్చార‌ని ఆవేదన చెందారు. ఎంతో బాధాక‌ర‌మైన ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని అన్నారు.

నేరుగా తనను రాజ‌కీయంగా ఎదుర్కొలేక‌నే ‘రండ రాజకీయాలు’ చేస్తున్నార‌ని అన్నారు. తనకున్న ప్రజాద‌ర‌ణ‌ను ఓర్వలేక‌నే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఐదోసారి కూడా తానే గెలుస్తాన‌ని తెలిసి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజ‌య్య బోరున విల‌పించారు. ఫాద‌ర్ కొలంబో జ‌యంతిని పుర‌స్కరించుకుని బుధ‌వారం ఉద‌యం హ‌న్మకొండ‌ జిల్లా ధ‌ర్మసాగ‌ర్ మండ‌లం క‌రుణాపురంలోని ఆయ‌న విగ్రహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఫాద‌ర్ కొలంబోతో తన‌కున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని నెమ‌రువేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడు.. రాజ‌కీయంగా త‌న‌ను దెబ్బకొట్టేందుకు కుట్రలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఎవరెన్ని కుట్రలు ప‌న్నినా ఫాద‌ర్ కొలంబో ఆశీస్సుల‌తో మ‌ళ్లీ తానే గెలుస్తాన‌ని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవ‌ల జాన‌కీపురం స‌ర్పంచ్ న‌వ్య ఆరోప‌ణ‌ల‌ను ఉటంకిస్తూ ఆయ‌న ప‌లుమార్లు భావోద్వేగానికి గుర‌య్యారు. ప్రసంగిస్తూనే క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

Advertisement

Next Story