- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ దోచుకుంది: సామ రామ్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: నీళ్లు, నిధులు, నియామకాల (Water,funding,recruitment) కోసం సాధించుకున్న తెలంగాణను (Telangana) పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటుందని టీపీసీసీ చైర్మన్ సామ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని, ప్రజల ఆంక్షల మేరకు పాలించలేదని అన్నారు. విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, సర్పంచ్‌లను కూడా ఆ పార్టీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. అమర వీరుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణకు చిహ్నంగా పిడికిలి బిగించిన చేతులు రాష్ట్రాన్ని మోస్తున్నట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Statue of Telangana Mother) తమ ప్రభుత్వం ప్రతిష్టించిందని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ఉద్యమకారులు ఏదైతే ఆశించి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని అన్నారు. సంక్షేమ పథకాలతో ( welfare schemes) పాటు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అమరులైన కుటుంబాలను కూడా త్వరలోనే తమ సర్కార్ ఆదుకుంటుందని తెలిపారు.