Vinod Kumar: ఇప్పుడున్న విధానాన్నే అమలు చేయండి

by Gantepaka Srikanth |
Vinod Kumar: ఇప్పుడున్న విధానాన్నే అమలు చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను డీ లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభ పడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంపీ స్థానాల విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని లోక్‌సభ స్థానాలను నిర్ణయించారని, ఇక ముందు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని, అవసరం అయితే అందుకు రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్థాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారని, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు.



Next Story

Most Viewed