- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి సాధించిన ఘనత ఇదేనా..? మాజీ మంత్రి హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్: గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏడాది పాలన కాలంలో సాధించిన ఘనత ఇదేనా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) విమర్శించారు. అంగాన్వాడీల సమస్యలపై(Anganwadi Issues) ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు(Salaries) అంటూ రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారని, ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. అలాగే 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు (Anganwadi Schools) అద్దెలు(Rents) కూడా చెల్లించని దుస్థితి ఏర్పడిందని, ఏడాది కాంగ్రెస్ పాలనలో (Congress Governance) మీరు సాధించిన ఘనత ఇదేనా అని మండిపడ్డారు.
అంతేగాక విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని, హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండి అని, ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.