- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BRS: తెలంగాణ చరిత్ర కేసీఆర్..! ఆనాడు నువ్వు ఎక్కడున్నావ్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ చరిత్ర(History Of Telangana) కేసీఆర్(KCR) అని, ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమానికి ఊపిరి పోసిన కేసీఆర్‌ను నువ్వా తుడిచేది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండిపడ్డారు. మంగళవారం మీడియా చిట్‌చాట్(Media Chit Chat)లో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్(Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడని, నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని గుర్తు చేశారు.
అలాగే నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని, నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడని చెబుతూ.. చిట్టినాయుడు!.. నువ్వా! కేసీఆర్ పేరును తుడిచేది అని వ్యంగ్యస్థ్రాలు సంధించారు. అంతేగాక తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానని, తన కారణంగానే కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యారని, కేటీఆర్ చేత తండ్రిని ఫినిష్ చేశానని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.