క్రైస్తవుల సంక్షేమానికి BRS ప్రభుత్వం పెద్దపీట: మేడే రాజీవ్ సాగర్

by Satheesh |
క్రైస్తవుల సంక్షేమానికి BRS ప్రభుత్వం పెద్దపీట: మేడే రాజీవ్ సాగర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్రైస్తవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో నిర్మించిన చర్చిని క్రైస్తవ మతపెద్దలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25 తేదీన సీఎం కేసీఆర్ చర్చిని ప్రారంభించనున్నట్లు తెలిసారు. మైనారిటీల సంక్షేమం కోసం ఈ ఏడాది రాష్ట్ర సర్కార్ రూ. 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. ఉప్పల్ భగాయత్‌లో క్రైస్తవ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు నిర్మాణానికి నిధులను సైతం కేటాయించిందన్నారు. మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి గురించి కుట్టు మిషన్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు 20 వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్‌లు అందజేయనున్నట్లు వివరించారు.

కల్పించేందుకు కుట్టు మిషన్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్ యంత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే క్రైస్తవులకు నూరు శాతం సబ్సిడీతో లక్ష ఆర్ధిక సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ ఈనెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ కమీషన్ వైస్ చైర్మన్ శంకర్ లూక్, తెలంగాణ సచివాలయ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, జెకబ్, లాల్ బహదూర్ శాస్త్రి, సీనియర్ నాయకులు ఎం. సల్మాన్ రాజ్, కెనెడీ, రాజేష్, అడ్వకేట్ సుధీర్, డేవిడ్ రాజ్, ప్రణయ్, సతీష్, బాబీ, వి. శ్రీనివాస్, ధీరజ్, రాజుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed