- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం.. కేసీఆర్కు వినతుల వెల్లువ
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే పలువురు మహిళా నేతలు, నాయకులు కేసీఆర్ కు వినతి పత్రాలు అందజేశారు. నిధులు కేటాయించాలని, పలు సమస్య లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ఎప్పుడు లేని విధంగా ఒక్కసారి గా వినతులు అందజేయడం చర్చనీయంశంగా మారింది.
కొనసాగుతున్న సమావేశం
సీఎం కెసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతున్నది. సమావేశం లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉండబోదని... అక్కడి పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అని.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారని.. రాబోయే ఎన్నికల హ్యాట్రిక్ విజయం మనదే అని... నిత్యం ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని... పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని తదితర అంశాలను పై మార్గం నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. పని చేసే వారికీ పార్టీ లో గుర్తిపు లభిస్తుంది అన్నారు.
కవిత, కేటీఆర్ డుమ్మా
బీఆరెస్ లెజీలేటివ్ పార్టీ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేదు. కేటీఆర్ యూఎస్ఏ కు ప్రభుత్వపరంగా వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత గత నేల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. అప్పుడు కళీ గాయంతో హాజరు కాలేకపోయానని, ఇప్పుడు జరుగుతున్న సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Read more:
సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం.. ఆ విషయాలపైనే చర్చ
బిగ్ న్యూస్: BRS ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎన్నికలే టార్గెట్‌గా సీఎం KCR నయా ప్లాన్!