RS Praveen Kumar : "గురుకుల బాట"లో పాల్గొన్న బీఆర్ఎస్ ఫైవ్ మెన్ కమిటీ

by M.Rajitha |
RS Praveen Kumar : గురుకుల బాటలో పాల్గొన్న బీఆర్ఎస్ ఫైవ్ మెన్ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) పార్టీ చేపట్టిన 'గురుకుల బాట'(Gurukula Bata) కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పాల్గొన్నారు. గురుకుల బాట ఫైవ్ మెన్ కమిటీ(Five Men Committee) అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యులు డా.ఎర్రోళ్ల శ్రీనివాస్, డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డా.ఆంజనేయ గౌడ్, విద్యార్థి అధ్యక్షులు గెళ్ళు శ్రీనివాస్ ఆదివారం ఇబ్రహీంపట్నం లోని షేర్ గూడ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్, కస్తూర్భ బాలికల కాలేజీకి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని రికార్డు చేసుకున్నామని ఆర్ఎస్పీ తెలిపారు. కాగా గత కొంతకాలంగా రాష్ట్రంలోని గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండగా.. ఆయా ఘటనలపై బీఆర్ఎస్ పార్టీ 'గురుకుల బాట' కార్యక్రమాన్ని చేపట్టి, ఫైవ్ మెన్ కమిటీని వేసింది. ఈ కమిటీ గురుకులాలను, హాస్టళ్లను తనిఖీ చేసి.. ఆ రిపోర్ట్ సహాయంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed