- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: 8+8 మరోసారి జీరోకి చేరింది.. బడ్జెట్ పై మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ఎనిమిది ప్లస్ ఎనిమిది (Eight Plus Eight) మరోసారి జీరో (Zero)కి చేరిందని, కేంద్రం రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) అన్నారు. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) 2025-26 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget) ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరపకపోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీ ప్రభుత్వం (BJP Government)పై పైర్ అవుతున్నారు. బడ్జెట్ లో తెలంగాణకు మొండి చెయ్యి చూపించడం దారుణం అని తీవ్ర స్థాయిలో విమర్శలు (Critisized) చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే కేంద్ర బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీలపై (Congress Party) మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ (Telangana)కు మళ్లీ డొల్లతనమే కనిపించిందని, పెండింగ్‌లో ఉన్న వాగ్దానాల సుదీర్ఘ జాబితాను నెరవేర్చడానికి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు (Telangana People) ఇది తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. బడ్జెట్ పాన్-ఇండియా (Pan India) విధానాన్ని తీసుకోకుండా రాబోయే ఢిల్లీ (Delhi), బీహార్ (Bihar) ఎన్నికలపై (Elections) ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే తప్పనిసరి ఆర్థిక విభజనలు, కేంద్ర గ్రాంట్ (Central Grants)లకు మించిన ప్రత్యేక సహాయాన్ని తెలంగాణ పొందలేకపోయిందని వ్యాఖ్యానించారు.
అంతేగాక గిరిజన యూనివర్సిటీ (Tribal University)కి నిధులు కేటాయించకుండా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 (AP Reorganization Act- 2014)ను కూడా గౌరవించడంలో బడ్జెట్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇక తెలంగాణలో 8+8 మరోసారి జీరోకి చేరడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీ (BJP MPs)లను ఎన్నుకోవడం వల్ల ఏమి ప్రయోజనం లేదని, వారు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ (specific project) కూడా సాధించలేకపోగా.. కనీసం ఒక్క ప్రధాన డిమాండ్ (major demand)ను కూడా నెరవేర్చలేకపోయారని బీఆర్ఎస్ నేత (BRS Leader) మండిపడ్డారు.
Also Read..
హరీష్ రావును ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవింగ్ చేసిన KCR