జగిత్యాల జిల్లాలో పట్టపగలు కిడ్నాప్ కలకలం

by Ramesh Goud |
జగిత్యాల జిల్లాలో పట్టపగలు కిడ్నాప్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా (Jagtial district)లో పట్టపగలు కిడ్నాప్ ఘటన (kidnapping incident) కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాప (child)ను ఓ దంపతుల జంట (couple) ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. స్థానికులు దేహశుద్ది చేశారు. ఘటన ప్రకారం జగిత్యాల పట్టణం (Jagtial town)లోని చింతకుంట వాడ (Chintakunta Wada)లో ఓ పాప తన ఇంటి ముందు ఆరు బయట ఆడుకుంటున్నది. అదే సమయంలో కిరాణా షాపు ఎక్కడ ఉంది విచారిస్తూ.. చేతిలో పిల్లాడితో ఉన్న మహిళతో పాటు ఓ వ్యక్తి అటుగా వచ్చారు. ఆడుకుంటున్న పాపను చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పాప వాళ్లను చూసి భయపడి ఇంట్లోకి పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగు పొరుగు వారు పాపను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన జంటను పట్టుకున్నారు.

వారిని విచారించగా.. సరైన సమాధానం రాలేదు. దీంతో వారిపై అనుమానం వచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ దంపతులను విచారించారు. తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు (Police) ఆ దంపతుల జంటపై కేసు (Case) నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దీనిపై పాప తండ్రి (Child Father) మాట్లాడుతూ.. మా పాప ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళతో పాటు మరో వ్యక్తి అనుమానాస్పందంగా తిరుగుతున్నారని, పాపకు చాక్లెట్ ఇస్తామని చెప్పి, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. పాప వారిని చూసి భయపడి ఇంట్లోకి వచ్చి చెప్పడంతో, బంధువులతో కలిసి వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక సీఐ కి సమాచారం అందించామని తెలిపారు. ఆ దంపతులు చెప్పే మాటలు బట్టి వారి వద్ద ఉన్న బాబు కూడా వాళ్లకు సంబంధించిన బాబు కాదనే అనుమానం కలుగుతుందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.



Next Story

Most Viewed