- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల అధినేతల నడుమ డైలాగ్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీపై ప్రతిపక్ష నాయకులు ఊపిరి ఆడనివ్వకుండా విమర్షలు చేస్తూ.. తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఎపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఎంపికైన వైఎస్ షర్మిల కూడా తనదైన మార్క్ రాజకీయం చేస్తూ.. సొంత అన్నకే సవాల్ విసురుతోంది. బహిరంగ సభలు, రోడ్డు షోలలో వైసీపీ ప్రభుత్వ పెద్దలను తూర్పారబడుతోంది. అదేవిధంగా వైసీపీ నాయకులు చేస్తున్న దందాలు, భూ కబ్జాలను బట్టబయలు చేస్తూ ప్రచారంలో దూసుకెళ్తోంది.
ఈ క్రమంలోనే అధికార పార్టీ ఆమెను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక మానసికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోంది. ఈ మేరకు పలు సోషల్ మీడియాలో ఆమెను ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ఆగంతకులు పోస్టులు పెడుతూ.. మనోస్థైర్యంపై దెబ్బకొడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతుల కోసం గాలిస్తున్నారు.