- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రాజెక్టుల సేఫ్టీపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిపై అందరిలోనూ అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలోని ప్రాజెక్టుల సేఫ్టీపై కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల సేఫ్టీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అన్నారు. ఇప్పటికే డ్యామ్‌ల మెయిన్‌టెనెన్స్ కోసం ప్రభుత్వం నుంచి రూ.350 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్, జూరాల, సింగూరు, కడెం ప్రాజెక్టులకు రిపేర్లు పూర్తయ్యాయని అన్నారు. గేట్ లిఫ్టింగ్ రోప్‌లను రీప్లేస్ చేసి మరమ్మతులు చేపట్టామని క్లారిటీ ఇచ్చారు.
ఇక నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని అన్నారు. కొన్ని ప్రాజెక్టు ప్రాజెక్టుల్లో బురద, ఇసుక తొలగింపు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని డ్యామ్‌లను మేడిగడ్డతో పోల్చొద్దని.. పూర్ డిజైన్, పూర్ కన్‌స్ట్రక్షన్, పూర్ మెయిన్‌టెన్స్‌తో ఆ డ్యామ్‌ను గత ప్రభుత్వం నిర్మించారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్‌ల సేఫ్టీకి జాతీయ స్థాయిలో డ్యాం సేఫ్టీ అథారిటీ ఉంటుందని తెలిపారు. ఇక స్టేట్ లెవల్‌లో ప్రాజెక్టుల సేఫ్టీని మానిటరింగ్ చేసేందుకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారి ఇంజనీరింగ్ చీఫ్‌గా నాగేందర్ రావు ఉన్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ఆయన కింది స్థాయి అధికారులకు లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.