BREAKING: నేడు టీఎస్‌ సీపీజీఈటీ(TSCPGET) నోటిఫికేషన్ విడుదల

by Shiva |   ( Updated:2024-05-15 01:51:36.0  )
BREAKING: నేడు టీఎస్‌ సీపీజీఈటీ(TSCPGET) నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఓయూ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా టీఎస్‌ సీపీజీఈటీ (TSCPGET)-2024 నిర్వహించనున్నారు. ఉమ్మడి పీజీ కోర్సుల ప్రవేశాల నిర్వహణపై ఇవాళ వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్స్‌తో సమావేశం జరగనుంది. అనంతరం ఉన్నత విద్య శాఖ మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో విద్య శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇవాళ విడుదల చేయనున్నట్లు టీఎస్ సీపీగేట్ 2024 కన్వీనర్ ప్రోఫెసర్ పాండురంగా రెడ్డి వెల్లడించారు. ఈ కోర్సులు ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు జేఎన్‌టీయూ‌లో కూడా కోర్సులు అందుబాటులో ఉండునున్నాయి.

Advertisement

Next Story