- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎన్-కన్వెన్షన్ కూల్చివేత ఇష్యూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా నెలకొల్పిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అక్రమార్కుల పాలిట సింహస్వప్నమైంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం మాదాపూర్‌లో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను భారీ భద్రత నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఘటనపై తాజాగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్‌ను బఫర్ జోన్‌లో కాదు.. చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదనే చెరువులు ఆక్రమణకు గురికాకుండా హైడ్రాను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి శాటిలైట్ ఫొటోలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. గత పదేళ్లలో చెరువుల ఆక్రమించిన వారి వివరాలు తెలుసుకుంటున్నామని, త్వరలోనే వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.