BREAKING: రేవంత్‌రెడ్డికి ఆ విషయంలో నాపై కక్ష ఉంది: మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: రేవంత్‌రెడ్డికి ఆ విషయంలో నాపై కక్ష ఉంది: మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎవరికీ ఎవరిపై వ్యక్తిగతంగా కోపతాపాలు ఉండవని కేసీఆర్ అన్నారు. ఇవాళ ఓ టీవీ చానల్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి తన మీద ఓ విషయంలో కక్ష ఉందని వెల్లడించారు. ఓటుకు నోటు కేసు తప్ప ఆయనకు ప్రత్యేకంగ తనపై ఇంకేం కక్ష ఉంటుందని గులాబీ బాస్ అన్నారు. 2015లో ఓటుకు నోట్లు ముట్టజెప్పి తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ఆదేశాలతో రేవంత్ కుట్రలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇవ్వబోతుంటే అడ్డంగా దొరికారని తెలిపారు.

రేవంత్‌రెడ్డికి తనపై ఆ విషయంలో కక్ష ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము పవర్‌లోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి తానే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానని అన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలిస్తే 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు భంగపాటు తప్పదని అన్నారు. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వస్తుందని, అసలు సీట్లే రాకపోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 12 సీట్లలో విజయ కేతనం ఎగురవేయబోతోందని అన్నారు.

Advertisement

Next Story