- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రేవంత్ నీ మాటలు కోటలు దాడుతుంటే.. ఇక్కడ పంటలు ఎండుతున్నాయ్ : మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై దృష్టి సారించకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతోందిని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలోని ఇరుకుల్లలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ మాటలు కోటలు దాడుతుంటే.. ఇక్కడ పంటలు ఎండుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల విద్యుత్ సరఫరా అవ్వడం లేదంటూ రైతులు చెబుతున్నారని ఆరోపించారు. రైతులు వేసిన పంటలనైనా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే 24 నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పంటలు ఎండుముఖం పట్టాయని, ఇక ఇప్పటి నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరికి రూ.500 బోనస్ ఈ సీజన్‌లోనే ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.