BREAKING: మండు వేసవిలోనూ హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం.. అత్యధికంగా ఆ ప్రాంతంలో నమోదు

by Shiva |   ( Updated:2024-05-07 17:23:39.0  )
BREAKING: మండు వేసవిలోనూ హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం.. అత్యధికంగా ఆ ప్రాంతంలో నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు బిగ్ రిలీప్ లభించింది. మంగళవారం సాయంత్రం భారీ ఈదరుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక కృష్ణానగర్ జనం వాయుదేవుడి ప్రతాపానికి భారీ వృక్షం నేలకూలింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక ఎర్రగడ్డ విషయానికొస్తే.. ఆయా ప్రాంతాలు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మండు వేసవిలోనూ హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 10.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. పంజాగుట్ట నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సమయత్తమవుతున్నాయి.

Read More...

భారీ వర్షం: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరిక

Advertisement

Next Story