- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌పై వెనక్కి తగ్గిన మల్లారెడ్డి! కేటీఆర్‌తో భేటీలో కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇచ్చేందుకు గులాబీ బాస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే పలు స్థానాలకు గాను అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే, దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్‌గిరి టికెట్ విషయంలో మాత్రం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
కాగా, కొన్నాళ్ల నుంచి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని మల్లారెడ్డి కోరారు. కానీ, అందుకు కేసీఆర్ సుముఖంగా లేకపోవడంలో మల్లారెడ్డి పార్టీ మారే ఆలోచన పడినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఇవాళ కేటీఆర్‌తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. తమ కుటుంబం నుంచి ఎవ్వరూ ఎంపీగా పోటీ చేయడం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ ఎవరికి మల్కాజ్‌గిరి టికెట్ కట్టబెట్టానా.. వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్‌కు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా తాను పార్టీ మారుతున్నారనే వదంతులపై కూడా స్పష్టతనిచ్చారు. కాలేజీల కూల్చివేత విషయంపైనే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లుగా మల్లారెడ్డి తెలిపారు.