BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాండేటరీ బెయిల్ కోరుతూ మరోసారి నిందితుల పిటిషన్లు

by Shiva |
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాండేటరీ బెయిల్ కోరుతూ  మరోసారి నిందితుల పిటిషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కీలక నిందితులైన ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, కేసు విచారణలో భాగంగా నాలుగోసారి చార్జిషీట్ రిటర్న్ అవ్వడంతో నిందితులు మరోసారి మాండేటరీ బెయిల్ కోరుతూ పిటిషన్లు వేశారు. తమను అరెస్ట్ చేసిన మూడున్నర నెలలు గడుస్తున్నా సక్రమంగా పోలీసులు ఇప్పటికీ చార్జిషీట్ వేయలేనదంతూ నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇరుపక్షా వాదనలు విన్న కోర్టలు పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story