- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో నేను ఎలా ఉంటా?: సీఎంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నట్లు మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ చేరుతున్న సందర్భంగా ఆయన అభిమానులు, అనుచరులు అందరూ తెలంగాణ భవన్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగంగా తెలంగాణకు పునాది పడిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తనకు టీఎస్‌పీఎస్‌సీ పదవిని ఆఫర్ చేశారని, కానీ తాను దానిని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. అనంతరం ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో రేవంత్‌రెడ్డి తనను పొగుడుతూనే.. హెచ్చరించారని ఆరోపించారు. అయన అలా తన మీద అక్కసుతోనే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్యాకేజీ తిసుకునే వాడినైతే అధికార పార్టీలోనే తాను చేరేవాడినని తెలిపారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఎలా ఉంటానని అన్నారు. కేసీఆర్ కల్పించిన వేదిక ద్వారా లక్ష్య సాధనకు ప్రయత్నిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.