BREAKING: గృహజ్యోతి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్.. వచ్చిన అసలు సమస్య అదే?

by Shiva |
BREAKING: గృహజ్యోతి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్.. వచ్చిన అసలు సమస్య అదే?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదలతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అధికార పార్టీతో పాటు ఇతర ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలోకి దిగాయి. ఈ క్రమంలోనే గృహజ్యోతి పథకానికి చిక్కొచ్చి పండింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం కొత్తగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టకూడదు. కాకపోతే ఇప్పటికే పథకంలో భాగస్వాములైన వినయోగదారులకు యథావిధిగా గృహజ్యోతి పథకం వర్తించనుంది. అయితే, ఇప్పటి వరకు జీరో బిల్ పొందని వారు స్థానిక ఎమ్మార్వో కార్యాలయాలు, విద్యుత్ శాఖ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వారందరి దరఖాస్తులను హోల్డ్‌లో పెట్టనున్నారు. కోడ్ ముగిసిన వెంటనే జూన్ చివరి వారంలో దరఖాస్తును స్క్రూటిని చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Advertisement

Next Story