BREAKING: రుణమాఫీపై రైతులకు సర్కార్ క్షమాపణ చెప్పాలె: మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

by Shiva |   ( Updated:2024-08-21 08:13:00.0  )
BREAKING: రుణమాఫీపై రైతులకు సర్కార్ క్షమాపణ చెప్పాలె: మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ విషయంలో రైతులకు సర్కార్ బాజాప్త క్షమాపణలు చప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు టోపీ పెట్టిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణ మాఫీ చేశామంటూ మంత్రి తుమ్మల చెబుతున్నారని.. అదే చేస్తే రైతులెందుకు ఆగ్రహంతో రగిలి రోడ్లు ఎక్కతున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో సీఎంతో సహా మంత్రులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఫైర్ అయ్యారు.

ఆందోళన చేస్తున్న రైతులపై అన్యాయంగా ఏడేళ్ల పాటు శిక్ష పడేలా కేసులే పెట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వంలో ఒకరికొకరికి పొంతనే లేదని.. సీఎం రేవంత్‌రెడ్డిది ఓ మాటైతే.. మంత్రులది తలో మాట అన్ని అన్నారు. వాళ్లందరి మాటలను బట్టి చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పావు వంతు కూడా కాలేదని విషయం అర్థం అవుతోందని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రాహావిష్కరణ సభలో సీఎం రేవంత్ బజారు భాష మాట్లాడారని.. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తామని అన్నారు.

తమ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితే కాదు.. భారత రైతు సమితి కూడా అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పందించి ఎప్పటిలోగా ప్రక్రియను పూర్తి చేస్తారో చెప్పాలని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పూర్తిగా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కోస్గి ఉమ్మడి మండలంలో 20,239 రైతు ఖాతాలు ఉన్నాయని అందులో కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని జాబితాను కేటీఆర్ చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఆందోళనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, బజారు భాష, చిల్లర భాషతో తాము పక్కదారి పట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అన్నారు. ఇక తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌజ్ లేదని.. తెలిసిన మిత్రుడిది లీజుకు తుసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. అది ఒకవేళ బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఫామ్ హౌజ్ ఎక్కడుందో తాను చూపిస్తానని, పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌజ్‌లు ఉన్నాయని.. తనకు మాత్రం లేదన్నారు. ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లిమిట్స్‌లో ఉందని, ఇప్పటికే ఆయన సోదరుడు అక్కడే ఉంటున్నాడని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story