- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య యూటర్న్.. ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నమోదు అవుతున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అధికార కాంగ్రెస్ చేరికల పర్వానికి తెర లేపింది. బీఆర్ఎస్ పార్టీయే టార్గెట్‌గా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న సాయంత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేకే నివాసానికి సీఎం రేవంత్ వెళ్లి పార్టీలో రావాలంటూ ఆహ్వానించారు. అదేవిధంగా ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మినిస్టర్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఈ మేరకు ఆయన రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా సూచనాప్రాయంగా తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు జరుపున్నట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్‌తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన మీద పోటీ చేసేందుకు రాజయ్య సిద్ధంగా ఉన్నానని కేసీఆర్‌కు సమాచారం అందజేసినట్లుగా రాజయ్య సన్నిహితులు తెలిపారు.