- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కొంపముంచిన ఆన్‌లైన్ ట్రేడింగ్.. అప్పనంగా రూ.6.10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ మోసాలు పెచ్చురిల్లుపోతున్నాయి. ప్రస్తుతం అన్ని చోట్ల క్యాష్ పేమెంట్స్ నిలిచిపోయి, ఆన్‌లైన్ పేమెంట్స్ కాలం నడుస్తుండటంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. అనంతరం క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కొల్లగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు.
వివరాల్లోకి వెళితే.. ట్రేడింగ్ లాభాల పేరిట ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాల్లో రూ.50 లక్షలు ఉన్నట్లుగా చూపారు. అనంతరం ఆ నగదును విత్‌డ్రా చేసుకోవాలంటూ రూ.10 లక్షలు చెల్లించాలంటూ నిందితులు తెలిపారు. దీంతో వారి మాటలు నమ్మిన బాధితుడు రూ.40 లక్షల లాభం వస్తుంది కదా.. అని వారికి విడతల వారీగా రూ.6.10 లక్షలు చెల్లించాడు. డబ్బు చల్లించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు తాను మోసపోయినట్లుగా గుర్తించాడు. వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
- Tags
- Cyber criminals