- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు, ఇప్పుడు ఇదే రాజకీయం: గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు ఇప్పుడు ఇదే రాష్ట్రంలో రాజకీయమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తనను తగ్గించాలనే ప్రయత్నం సాగదని, కేసీఆర్ అంటేనే ఓ చరిత్ర అని అన్నారు. ఇవాళ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇవ్వడంతో ప్రజలు అందుకు ఆకర్షితులయ్యారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నిక కేవలం 1.5 శాతం ఎక్కువ ఓట్లుతో వారు అధికారంలోకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూసి ఎందుకు గెలిపించామురా అంటూ ప్రజలు ఇప్పుడు తీవ్రంగా ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు రైతాంగం కరువులో విలవిలలాడుతోందని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు ఇప్పుడుంది రాష్ట్రంలో ఇదే రాజకీయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో కూడా ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఫైర్ అయ్యారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేక కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరగితే తాగుబోతు రాష్ట్రమంటూ సోషల్ మీడియాలో బాకా చానళ్లు గోలగోల చేశాయని, అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగితే ఆదాయం వచ్చిందంటూ జబ్బలు చరుస్తున్నారని కేసీఆర్ సెటైర్లు వేశారు.
- Tags
- BRS Chief KCR