BREAKING : కాంగ్రెస్ తుది జాబితా విడుదల

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-24 16:18:57.0  )
BREAKING :  కాంగ్రెస్ తుది జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పెండింగ్ మూడు స్థానాలపై సస్పెన్స్ వీడింది. తెలంగాణలోని పెండింగ్ మూడు స్థానాల అభ్యర్థులను ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ముగ్గురు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఎన్నికలు జరగనుండగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి మహమ్మద్ వాలియుల్లా సమీర్లు ఇప్పటికే నామినేషన్లు వేశారు. అభ్యర్థులను ప్రకటించకముందే నామినేషన్లు వేయడంతో కాస్త గందరగోళం నెలకొన్నా ఎట్టకేలకు కాంగ్రెస్ అఫీషియల్‌గా పేర్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెర దించినట్లయింది.

మూడు స్థానాలకు అభ్యర్థులు వీరే..!

కరీంనగర్ - వెలిచాల రాజేందర్ రావు

హైదరాబాద్ - మహమ్మద్ వాలియుల్లా సమీర్

ఖమ్మం - రామసహాయం రఘురాం రెడ్డి

Advertisement

Next Story