- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: రాష్ట్రానికి చల్లని తీపి కబురు.. ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఇన్నాళ్లు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్ర ప్రజలను వరుణుడు కరుణించబోతున్నాడు. రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు, అదేవిధంగా ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. సుమారు గంటకు 30 నుంచి 40 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story