- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING : కవితపై కోర్టులో సీబీఐ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. అయితే కవితను ఐదు రోజుల కస్టడీకి సీబీఐ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్ తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం.. ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని కోర్టుకు తెలిపింది.
రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 కోట్లు అందజేశారని పేర్కొంది. వాట్సాప్ చాట్‌లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్ మెంట్ ప్రకారం కవితకు.. ఇండో స్పిరిట్ సంస్థలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం.. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. ఈ విషయాలను చార్జిషీట్లలో పొందుపరిచామని సీబీఐ న్యాయవాది తెలిపారు.