- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BREAKING: పీవీ నర్సింహారావుకు ‘భారతరత్న’.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ ప్రధానిగా సేవలందించిన పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో కొత్త ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఇతర దేశాలతో పోటీ పడేలా చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు. ‘భారతరత్న’ పురస్కారం ఆలస్యమైనా ఆయనకు ఆ గౌరవం దక్కడం దేశ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తరపున, రాష్ట్ర ప్రజల తరపున, సభ తరపున పీవీ నరసింహా రావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆయన ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా రాజాకార్ల దాష్టీకంపై ఎనలేని పోరాటాలు చేసి హైదారాబాద్ సంస్థాన విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.