- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ : కాసేపట్లో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కాసేపట్లో సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నాలుగు సార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఐదోసారి దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ అరెస్ట్ చేయగా ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. కాగా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సునితారెడ్డి ఇంప్లిడ్ పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారిస్తామని హై కోర్టు తెలిపింది. సాయంత్రం 5 గంటల తర్వాతే విచారించాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న అవినాష్ రెడ్డికి ఈ కేసులో నోటీసులు జారీ చేసిన సీబీఐ 3 గంటలకు రావాలని కోరిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇప్పటికే అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీస్‌కు బయల్దేరారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.