- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 ఏళ్ల సెంటిమెంట్‌కు బ్రేక్.. ఆ ఇళ్లు ఖాళీ చేయనున్న KCR
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలోని 23, తుగ్లక్ రోడ్డులో తన అధికారిక నివాసంతో 20 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. 2004లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచి మన్మోహన్ సింగ్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్డులో క్వార్టర్స్‌ను ఆనాటి ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా ఇదే నివాసంలో కొనసాగారు.
2009లో మహబూబ్ నగర్ ఎంపీగా, 2014లో తెలంగాణ సీఎంగా అయిన తర్వాత ఆయన అదే నివాసాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక, నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచిన తర్వాత కూడా అదే నివాసాన్ని అధికారికంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ ఇక్కడ బస చేసేవారు. 2018లో రెండో సారి సీఎం అయిన తర్వాత కూడా ఇదే నివాసాన్ని సీఎం కేసీఆర్ కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా రిజైన్ చేయగా ఢిల్లీలోని నివాసాన్ని ఖాళీ చేస్తామని రెండు రోజులు గడువు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఢిల్లీ అధికారులకు తెలిపాయి.