BRAOU: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Shiva |
BRAOU: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు ఉన్నత చదువులు చదవాలని ఉన్నా.. అందుకు కావాల్సిన వనరులు లేక మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ/ ఎంకాం/ఎమ్మెస్సీ) పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు చేపడతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా ప్రస్తుతం వర్సిటీలో డిగ్రీ, పీజీ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం వర్సిటీ సహాయక కేంద్ర నంబర్లు 7382929570/580, 040-23680290/291/294/295, 55, 18005990101లను లేదా అధికారిక వెబ్ సైట్ www.braouonline.in, www.braou.ac.in‌లో సంప్రదించాలని హెల్ప్ డెస్క్ డైరెక్టర్‌ ఎల్‌వీకే రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story