- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీ నామరూపాల్లేకుండా పోతుంది: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాహుల్‌గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. న్యాయ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేసిందన్నారు. కర్నాటకలోని కోలార్‌లో 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడితే గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు వెలువరించిందని, పరువునష్టం కేసులో ఆయనను దోషిగా నిర్ధారించి రెండేళ్ళ జైలుశిక్ష విధించిందని, ఆ వెంటనే లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత నిర్ణయం తీసుకున్నదని గుర్తుచేశారు. నిజానికి కర్నాటకలో జరిగిన వ్యవహారంపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీసుకున్న నిర్ణయం, జడ్జి వెలువరించిన తీర్పు సహేతుకం కాదని, సూరత్ జడ్జి పరిధిలోకి రాని వ్యవహారమన్నారు.
దేశ సంపదను గౌతమ్ అదానికి ధారాదత్తం చేయడాన్ని రాహుల్‌గాంధీ ప్రశ్నించారని, లోక్‌సభ వేదికగానే ఆధారాలతో సహా వివరించారని, దీన్ని జీర్ణించుకోలేకనే బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. నిజానికి సూరత్ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడానికి రాహుల్‌గాంధీకి 30 రోజులు గడువు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయినా హడావిడిగా రాహుల్‌గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించే నిర్ణయం జరిగిపోయిందన్నారు. ఇందిరాగాంధీని గతంలో లోక్‌సభ నుంచి బహిష్కరించిన పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, ఇప్పుడు రాహుల్‌గాంధీ విషయంలోనూ బీజేపీకి అదే ఎదురవుతుందన్నారు.