‘రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు’

by GSrikanth |   ( Updated:2023-04-10 14:58:42.0  )
‘రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి విమర్శలు చేశారు. రైల్వే ప్రాజెక్టుల అమలు విషయంలో తెలంగాణకు కేంద్రం సాయం చేస్తున్నా.. చేయడం లేదంటూ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేస్తున్నదని, కేసీఆర్ ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి, అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. రైల్వే ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్‌లు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అనవసరంగా ఆరోపణలు చేస్తోందన్నారు.

ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.544 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్రం ఇప్పటివరకు రూ.279 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆయన సూచించారు. ఇన్నాళ్లు నిధుల విడుదల కోసం కేంద్రం లేఖలు పంపుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.986 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని విమర్శించారు.

Also Read..

Minister Amarnath: మీ స్టాండ్ ఏంటో చెప్పండి.. సీఎం కేసీఆర్‌కు ప్రశ్నల వర్షం

Advertisement

Next Story

Most Viewed