BJP ST Morcha: బీజేపీ కార్యాలయం వద్ద సోనియా గాంధీ దిష్ఠిబొమ్మ దహనం

by Ramesh Goud |
BJP ST Morcha: బీజేపీ కార్యాలయం వద్ద సోనియా గాంధీ దిష్ఠిబొమ్మ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేతలు(Congress Leaders) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్టీ మోర్చా (BJP ST Morcha) నాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi) దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో (Budget Speech) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి రాష్ట్రపతి కార్యాలయం (President's Office) స్పందిస్తూ.. సంచలన లేఖను విడుదల చేసింది. సోనియా గాంధీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని, ఉన్నత పదవీ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ధీటుగా బదులిచ్చింది.

దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎస్టీ మోర్చా నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP State Office) ఎదుట సోనియా గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు.. భారత రాష్ట్రపతి, ఆదివాసీ మహిళా శ్రీమతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అలాగే దీనిపై సోనియాగాంధీ, యావత్ కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్రపతిని బహిరంగ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా కళ్యాణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్ సహా తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ఇటలీ దేశం నుంచి వచ్చిన సోనియా గాంధీకి ఈ దేశంలోని గిరిజనులు, దళితులు బడుగుబలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందడం ఏ మాత్రం ఇష్టం లేదనే అంశం.. నిన్నటి అవమానకర వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ఈ దేశంలోని ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తు, రాజ్యాంగంపై విశ్వాసాన్ని కోల్పోతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి పతనమై పోవడాన్ని జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. NDA మిత్రపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ముని ప్రకటించగానే, ఓడిపోతామని తెలిసి కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దింపి ఓటమిపాలందని తెలిపారు. అంతటితో ఆగకుండా మూర్ము గెలిచినప్పటి నుంచి నేటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన ఆదివాసీ మహిళా రాష్ట్రపతి కావడాన్ని నిత్యం వ్యతిరేకిస్తూ వారిని కించపరిచేలా మాట్లాడటాన్ని యావత్ భారత సమాజం ముఖ్యంగా దేశంలోని 10 కోట్ల మంది గిరిజన సమాజం కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వెంటనే రాష్ట్రపతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేనియెడల దేశంలో ఎక్కడ కూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగలేరని హెచ్చరించారు.


Next Story

Most Viewed